బొగ్గు గనుల వేలాన్ని ఆపాలి
- సీఐటీయూ నేతల డిమాండ్
మంచిర్యాల, జూన్ 22 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు గనుల బహిరంగ వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాలలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్‌లకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగరేణికి కేటాయించాల్సిన గనులను వేలం పేరుతో ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, చిప్పకుర్తి కుమార్, నరేష్, పోషమ్మ, అరుణ, వెంకట లక్ష్మీ, సతీష్, ప్రవీణ్, శ్రీను, శంకర్ పాల్గొన్నారు.






