పునరావాస గ్రామాల్లో మౌలిక వసతులు
- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్22 (విజయక్రాంతి): కవ్వాల్ అభయార్యణంలోని పునరావాస గ్రామలైన మైసంపేట, రాంపూర్, మద్దిపడగ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం వడెం మండలంలోని పునరావాస గ్రామాలను ఆమె సందర్శించారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కల్పించిన సౌకర్యాలు, కల్పించవల్సిన సదుపాయాల గురించి తెలసుకొన్నారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, మురుగు కాలువల వంటి సౌకర్యాల గురించి ఆరా తీశారు. మండల, జిల్లా స్థాయి అధికారులు గ్రామాలను ఎల్లప్పుడూ సందర్శిం చాలని సూచించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు. మహిళల జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అటవీశాఖ అధికారి ప్రసాద్, ఆర్డీవో రత్నకల్యాణి ఉన్నారు.






