24-08-2025 01:52:11 PM
హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ(Bhadrachalam Agency)లో ఆదివారం బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. 17 ఏళ్ల గిరిజన బాలికపై ఆటో డ్రైవర్లు ఘాతుకాన్ని చూపారు. బాలికను డ్రైవర్లు ఆటోలో తీసుకెళ్లి, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.