24-08-2025 02:44:50 PM
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, లక్ష మంది నకిలీ ఓటర్లు ఎలా వచ్చారనే దానిపై ఈసీ(Election Commission) స్పందించట్లేదని ఆరోపించారు. ఓట్ల చోరీ వ్యాఖ్యలపై అఫిడవిట్ ఇవ్వాలని ఈసీ అడుగుతోందని, అఫిడవిట్ ఇవ్వకపోతే నా వ్యాఖ్యలను అంగీకరించబోమని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయంపై అనురాగ్ ఠాకుర్ మాట్లాడితే ఈసీ అఫిడవిట్ కోరట్లేదని, ఎన్నికల కమిషన్ ఎవరికి మద్దతుగా నిలుస్తుందో తెలుస్తుందని తెలిపారు. ఈసీ తటస్థంగా ఉంటే అనురాగ్ ఠాకుర్ నుంచి అఫిడవిట్ కోరేవారు అని, ఎన్నికల కమిషన్ తటస్థంగా లేదని అర్థమవుతుందని అన్నారు. పేదల ఓట్లు చోరీ చేయాలని ప్రధాని మోదీ(PM Modi) కోరుకుంటున్నారని, బిహార్ లో ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓట్లు చోరీకి యత్నిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.