calender_icon.png 15 July, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాపిడో వాహనాలతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు..

14-07-2025 11:33:54 PM

కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రఘు..

హనుమకొండ (విజయక్రాంతి): ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి వాహనాలతో తాము ఉపాధి కోల్పోతున్నామని కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్(Kakatiya Auto Drivers Union) రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రఘు, రాష్ట్ర ముఖ్య సలహదారులు మొగుసాల దేవేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాష అన్నారు. రాపిడో, ఓలా, ఉబర్ వంటి వాహనాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లేబర్ అడ్డా వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ర్యాపిడో, ఓలా, ఉబర్ వాహనాల యూనిట్ల తయారీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ వాహనదారులు ఆర్టీఏ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిసున్నారని ఆరోపించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యాసిన్, ఎండి షఫీ అహ్మద్,భూక్య రామకృష్ణ, ఖాజా పాష, ఆనంద్, కాకతీయ ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎండి జహంగీర్, అధ్యక్షుడు ఎండి కాజా  పాష, కోశాధికారి రాజు, క్రాంతి, సునిల్, దేవేందర్, శ్రీశైలం, సీఐటీయూ నేత బాను నాయక్ తదితరులు పాల్గొన్నారు.