15-07-2025 12:00:00 AM
ఆదిలాబాద్, జులై 14 (విజయ క్రాంతి): ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడి పండుగను కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఆషాడ మాసం సందర్భంగా స్థానిక గాంధీపార్క్‌లోని భీమన్న ఆలయంలో సోమవారం నిర్వహించిన పండుగలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... ముదిరాజ్ కులస్తుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు.
భీమన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ మంత్రి జోగు రామన్న సైతం భీమన్న దేవుని పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా భీమన్న దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడు తూ... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆలయాల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులను కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ, మానసిక ప్రశాంతతను పెం పొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల స్తులు ధారవేణి రాము, బొజ్జ సంతోష్, దార్ష రవి, నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.