calender_icon.png 15 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ ఆసుపత్రిలో అందుబాటులోకి స్కానింగ్ సేవలు

15-07-2025 12:00:00 AM

ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి

నాగర్కర్నూల్, జూలై 14 (విజయక్రాంతి)నాగర్కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో గర్భిణీలకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌకర్యం అం దుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలిపారు. సోమవారం ఆ స్పత్రిలోని పలు వార్డులను పరిశీలించిన ఆమె స్కానింగ్, ఎక్స్రే సౌకర్యం లేక గర్భిణీలు, ఇతర రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని గుర్తించి స్కానింగ్ గదిని ప్రారంభించారు.

ఇకపై ఎవరు కూడా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే అవసరం లేదని జిల్లా జనరల్ ఆస్పత్రిలోనే రేడియాలజిస్ట్ ద్వారా స్కానింగ్, ఎక్స్రే సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్రే సేవలు ప్రతిరోజూ 80 నుంచి 90 మంది రోగులు వినియోగిస్తున్నామన్నారు.

ప్రత్యేక వ్యాధుల నిర్ధార ణ నిమిత్తం అవసరమైన వారికి సిటీ స్కాన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రోహిత్, రేడియాలజిస్ట్ డాక్టర్ ఈ. ఈశ్వరి, గ్రేడ్-1 మెడికో సోషల్ వర్కర్లు సి. జ్యోతి, వి. విజయలక్ష్మి, డి. బాలమ్మ, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, సుజాత తదితరులుపాల్గొన్నారు.