11 April, 2026 | 10:10 AM

జనవరి 17 నుంచి ఆటో ఎక్స్‌పో

16-12-2024 12:09 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జనవరిలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్‌పో 2025 ఎడిషన్‌లో అత్యధికంగా 34 వాహన ఉత్పత్తి సంస్థలు పాల్గొంటున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) తెలిపింది. మోటార్ షో పేరుతో నిర్వహించే ఈ ఎక్స్‌పో జనవరి 17న న్యూఢిల్లీ భారత్ మండపంలో మొదలై 22వరకూ కొనసాగుతుంది. వివిధ కంపెనీలు వాటి కొత్త టెక్నాలజీలను, పవర్‌ట్రైన్స్‌తో కూడిన మోడల్స్‌ను ఇందులో ప్రదర్శిస్తాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్, హ్యుందాయ్ మోటార్, కియా మోటార్ వాటి మోడల్స్‌ను  ప్రదర్శిస్తాయని అన్నారు.