18 April, 2026 | 1:55 AM

బస్సును ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

16-06-2025 10:34 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్(Mahabubabad) కురవి ప్రధాన రహదారిపై బేతోలు గ్రామ సమీపంలో సోమవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మాలోత్ అమల(25) దుర్మరణం పాలయ్యింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. బయ్యారం మండలం అల్లిగూడెం శివారు బొడ్డే తండా నుంచి కురవి దేవాలయానికి ఆటోలో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.