30-12-2025 04:28:32 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి బైక్ పై వెళుతూ ఉండగా ఉప్పల్ రాజలక్ష్మి థియేటర్ భారీ వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావును 108 అంబులెన్స్ ద్వారా కామినేని ఆసుపత్రి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ప్రమాదకట్టకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.