30-12-2025 04:24:30 PM
ఉప్పల్,(విజయక్రాంతి): మహావిష్ణువు దివ్యా అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఉప్పల్ శాసనసభ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ముక్కోటి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని సందర్భంగా నాచారం డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్ తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ నాథుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వెల్లువిరిచాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.