జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకారించిన ఏవి. రంగనాథ్
26-06-2024 09:18 PM
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్‌ఎంసీ (ఈవీడీఎం) ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నూతన డైరెక్టర్‌గా ఏవి. రంగనాథ్ నియమించబడారు. బుద్ధ భవన్ కార్యాలయంలో ఏవి. రంగనాథ్ ఈవీడీఎం నూతన డైరెక్టర్ గా బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన డైరెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇన్నాళ్లు జీహెచ్‌ఎంసీ వరకు మాత్రమే ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సేవలను త్వరలో హెచ్‌ఎండీఏ వరకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏవి. రంగనాథ్‌ను ఈవీడీఎం డైరెక్టర్‌గా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.






