ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీర్పు రిజర్వ్
హైదరాబాద్ : తెలంగాణ పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పక్కా ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తాయాయి. తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లపై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీటు లేదన్న నిందితుల న్యాయవాది అన్నారు. అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చని పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల న్యాయవాదులు పేర్కొన్నారు. ఛార్జిషీట్ 90 రోజుల లూపే వేశామన్న పోలీసుల తరుపు న్యాయవాదులు తెలిపారు. తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ చేయనట్లు కాదన్న పోలీసులన్నారు.






