25 May, 2026 | 1:05 AM

ఆచార్య రాచపాళేనికి పురస్కారం

25-05-2026 12:00 AM

అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు యేటా అందజేస్తున్న ‘అడిగోపుల సాహిత్య ప్రతిభా పురస్కారానికి (౨02౬) ప్రముఖ రచయిత, కవి, సాహితీ విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఎంపికయ్యారు.

జూలై రెండో వారంలో ఏపీలోని తిరుపతిలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాచపాళేనికి పురస్కార ప్రదానం చేస్తామని ‘తెలుగుసందడి” సాహిత్య, సాంస్కతిక వ్యవహారాల సంచాలకుడు అడిగోపుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో నాలు గు దశాబ్దాలుగా అధ్యాపకునిగా పిల్లలకు పాఠాలు బోధిస్తూనే, సాహిత్య రంగానికి విశిష్ట సేవలంవదించారని తెలిపారు. జీవితకాలంలో 102 విమర్శ, పరిశోధ న, కవిత్వ, సంపాదక పుస్తకాలు ప్రచురించారని, ఆయన సారథ్యంలో 45 మం ది పీహెచ్‌డీలు పూర్తి చేశారని వివరించారు.