1 July, 2026 | 7:23 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

నూరు శాతం ఫలితాలు సాధించినందుకు అవార్డు

28-05-2025 10:52 PM

నడిగూడెం: 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతిలో, ఇంటర్మీడియట్లో వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించినందుకు గాను నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి బుధవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు 238 ఉండగా అందులో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో నడిగూడెం గురుకుల పాఠశాల కూడా ఎంపిక కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డును అందజేసి గురుకుల సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గురుకుల విద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం శివప్రసాద్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గురుకుల సొసైటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.