15 June, 2026 | 1:24 AM

అన్నవరం దేవేందర్‌కు పురస్కారం

15-06-2026 12:00 AM

కరీంనగర్‌లోని ఫిలింభవన్‌లో ఈనెల ౨౮న ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు నలిమెల బుచ్చమ్మ  స్మారక తొలి పురస్కార ప్రదానం చేయనున్నట్లు --సాహితీ సోపతి సంస్థ ఆర్థిక కార్యదర్శి బూర్ల వేంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, రచయిత, బహు భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ ‘తెలుగులో సామెతలు -ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశోధన (ఎంఫిల్ ), తెలుగు, మలయాళ సామెతల కుటుంబ జీవన చిత్రము (పీహెచ్‌డీ) అనే పరిశోధన పుస్తకాల ఆవిష్కరణ కూడా జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య ఎన్.గోపి హాజరుకానున్నారు.