22 July, 2026 | 1:57 AM

బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన పెంచాలి

22-07-2026 12:31 AM

కేర్ హాస్పిటల్స్ డాక్టర్ ఎస్‌కే జైస్వాల్

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ప్రపంచ మెదడు దినోత్స వం (జూలై 22) సందర్భంగా కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్‌వోడీ న్యూరాలజీ డా. ఎస్‌కె జైస్వాల్, కేర్ హాస్పిటల్స్ న్యూరో నిపుణులు బ్రెయిన్ స్ట్రోక్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏటా సుమారు 12.5 లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని, ఇటీవల యువతలోనూ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయన్నారు. పక్షవాతం వచ్చిన తర్వాతే ఆస్పత్రికి రావడం వల్ల చికిత్సకు అత్యంత కీలకమైన గోల్డెన్ టైమ్ కో ల్పోయి చాలామంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారన్నారు.

అకస్మాత్తుగా చేయి లేదా కాలు బలహీనపడటం, మాట త  డబడటం, చూపు తగ్గిపోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. స్ట్రోక్ వచ్చిన తొలి నాలుగున్నర గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలో చికిత్స అందితే ప్రాణాలతో పాటు శాశ్వత వైకల్యాన్ని కూడా నివారించే అవకాశం ఉంటుందన్నారు. కేర్ హాస్పిటల్స్, నాంపల్లి సీనియర్ కన్సల్టెంట్  న్యూరో అండ్ స్పున్ సర్జరీ డా. మహమ్మద్ ఇ మ్రాన్ మాట్లాడుతూ అధునాతన ఎంఆర్‌ఐ, న్యూరోనావిగేషన్, మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరోసర్జరీ వంటి సాంకేతికతతో మెదడు కణితులు, తలకు గా యాలు, హైడ్రోసెఫాలస్ వంటి  వ్యాధులకు విజయవంతంగా చికిత్స అందిస్తున్నామన్నారు.