22 July, 2026 | 1:48 AM

మెదడు ఆరోగ్యంపై అవగాహన ఉండాలి

22-07-2026 12:29 AM

కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ సావిత్ర శాస్త్రి బీవీ

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ప్రపంచ మెదడు దినోత్సవం (జూలై 22) సం దర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ అండ్ రోబోటిక్ స్పున్ సర్జన్ డాక్టర్ సావిత్ర శాస్త్రి బివి మెదడు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది థీమ్ ‘అందరికీ మెదడు ఆరోగ్యం’ అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన న్యూరాలజీ, న్యూరోసర్జరీ వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

స్ట్రోక్, మూర్ఛ, మెదడు కణితులు, డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా వైకల్యాలు, మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు. స్ట్రోక్ లక్షణాలను గుర్తించేందుకు ‘ఫాస్ట్’ (ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం) విధానాన్ని గుర్తుంచుకుని, ముఖం వాలిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే  ఆస్పత్రి కి తరలించాలని సూచించారు.  ప్ర జలు తలనొప్పి, మూర్ఛలు, జ్ఞాపకశక్తి తగ్గడం, బలహీనత వంటి లక్షణాలను ని ర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సం ప్రదించాలని డాక్టర్ సావిత్ర శాస్త్రి సూచించారు.