17-07-2025 12:27:04 AM
చోరీతో తెల్లవారిన గోపాలపేట
పనిచేయని సీసీ కెమెరాలు
కేంద్రంలో ఇలా పల్లెల్లో ఎలా
గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేటలో నిఘా యంత్రాలు కళ్ళు మూసుకోవడం దొంగలకు చోరీలు చెయ్యడానికి సులభంగా ఉండడం చోరీలతోనే తెల్లవారుతుంది. ఈ సంఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో నెలకొంది. గతంలో కొంతమంది ఎస్సైలు ఉన్నత పోలీస్ శాఖ ఆదేశాల మేరకు గోపాలపేట మండల కేంద్రంలో ప్రజలకు క్రైములపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరచడమే కాకుండా వారి సహాయాన్ని తీసుకొని అప్పటి ఎస్సై అధికారులు గోపాలపేట నడిబొడ్డున కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటి ఆలనా పాలన చూసుకోక పోవడం పట్ల అవి కాస్త శిథిలావస్థకు చేరడం పనిచేయకపోవడం జరిగింది. సీసీ కెమెరాలు బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారే కానీ వాటికి సంబంధించిన అధికారులు వాటి పనితీరును పరిశీలించకపోయారు. దీంతో చోరీలకు పాల్పడే వ్యక్తులకు సులభంగా ఉంది.
ఇది ఇలా ఉండగా మంగళవారం రోజున గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ ప్రాంతంలో సిసి కెమెరాలకు పది అడుగుల దూరంలోనే చోరీ జరిగింది. గోపాలపేట మండల కేంద్రానికి చెందిన ఓ.నిరుపేద వ్యక్తులు చిన్నచిన్న షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మంగళవారం ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు శివ మొబైల్ షా ప్ లో. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి అందులో ఉన్న నాలుగు స్మార్ట్ మొబైల్ కొన్ని కొత్త చార్జర్లు ఎత్తుకెళ్లినట్లు మొబైల్ షాప్ యజమాని శివ తెలిపారు. చిన్న మొబైల్ షాప్ లోనే చోరీ జరగడం చుట్టుపక్కల లక్షల విలువ చేసే షాపుల పరిస్థితి ఏంటని యజమానులు నువ్వేరా పోయారు. ఉన్నాయి వాటి యజమానులు పనిచేయని సీసీ కెమెరాలు పై చర్చలు జరుపుతున్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మొబైల్ షాప్ యజమాని శివ గుర్తుతెలియని వ్యక్తులు తన షాపులో చోరీ జరిపారని. ఈ సంఘటనపై తనకు న్యాయం జరపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.