26 July, 2026 | 2:15 AM

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

26-07-2026 12:00 AM

ఉప్పల్, జూలై 25 (విజయక్రాంతి): ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో ఉప్పల్ స్కై వాక్‌పై డ్రగ్స్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పీఎస్ హౌస్ ఆఫీసర్ రామలింగారెడ్డి, ఎస్‌ఐలు రజినీకర్, చిరంజీవి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొని అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.