‘ఎంఎస్‌ఎంఈ’ పథకాలపై అవగాహన
మల్కాజిగిరి, ఆగస్ట్ 25, (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ర్యాంప్ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ’ఎంఎస్‌ఎంఈ’ పథకాలపై మం గళవారం నేరేడ్ మెట్లో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హజరై, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలు, రాయితీలు, అవకాశాలు, ప్రభుత్వ సహాయంపై అవగాహన కల్పించారు.
సా ్థనిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలకు ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు, అవసర మైన మార్గదర్శకత్వ ంపై సమగ్ర సమాచారం అందిం చడం దా ్వరా మల్కాజిగిరి నియోజక వర్గంలో ’ఎంఎస్‌ఎంఈ’ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ అవగాహన సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ముందుకు సాగేందుకు ర్యాంప్ పథకం పరిధిలో జాతీయ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించే దిశగా కార్యాచరణ రూపొందించి, నిర్దిష్ట ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమం ఒక ముఖ్య మైన ముందడుగుగా నిలిచిందన్నారు.
’ఎంఎస్‌ఎంఈ’ లకు అవసరమైన సమాచారం, మార్గదర్శ కత్వం, ప్రభుత్వ సహా యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టితో పాటు స్థానిక ఆర్థి కాభివృద్ధికి తోడ్పడటమే తమ లక్ష్యంగా మల్కాజిగిరి లో ’ఎంఎస్ ఎంఈ’ అభివృద్ధి స్థానిక ఆర్థికాభివృద్ధికి ఈ కార్యక్ర మం ద్వారా నాంది పలక డం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్మే సంచాలకులు సూర్య ప్రకాష్ గౌడ్, జిల్లా పరిశ్ర మల శాఖ సహాయ సంచాలకులు జయంతి, సహాయ అధ్యాపకుల తేజేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, జీకే హనుమంతరావు, వెంకన్న, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, రాముయాదవ్, శ్రీనివాస్ యాదవ్, కన్నబాబు, ఈడీ సీ స్టాఫ్, బ్యాంకర్స్, యువ కులు శివసాయి యాదవ్, నిర్ణీత్ రెడ్డి, సాయిగౌడ్, సుమన్ గౌడ్, నిఖిల్, శరత్ గౌడ్, సుమన్ గౌడ్, రాజేష్ గౌడ్, విజయ్ రెడ్డి పాల్గొన్నారు.






