గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్
సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు
ఎర్రుపాలెం, ఆగస్టు 25 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కు ఎర్రుపాలెం మండల కార్మికులు వెళ్తున్న సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ పాలకులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం అవేదన వ్యాక్తం చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండు నర ఏండ్లు అయినప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ చేయలేదని మండిపడ్డారు.
సమస్యల పరిష్కారానికి అనేక సార్లు విన్నవించినా ప్రస్తుతం మండల, జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం eస్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ, వివిధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్మికుల అధ్యక్షా కార్యదర్శులు గoతల నాగేశ్వరావు, కలపాల రవీంద్రా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






