కోతులు, కుక్కల బెడద నుంచి కాపాడాలి
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు
చుంచుపల్లి, ఆగస్టు 25,(విజయక్రాంతి ): విద్యానగర్ పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కరించాలని ముఖ్యంగా కోతులు కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు కోరారు. విద్యానగర్ పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ శాంతిశ్రీ కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యానగర్ పంచాయతీలో సిపిఎం బృందం అధ్యయనం ద్వారా కొన్ని సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధానంగా కోతులు కుక్కలు బెడద పంచాయతీ పరిధిలో తీవ్రంగా ఉంది దీనివలన ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.డ్రైనేజీ సమస్య ఉంది. కాలువల్లో చెత్త పేరుకు పోయిందనీ, ఒక చోట డ్రైనేజీ పైపు పగిలిపోయి మురుగునీరు రోడ్ల పైకి వస్తుందనీ అన్నారు.
ప్రస్తుతం వర్షాకాలంలో దోమలు విపరీతంగా ఉంటాయని దోమ కాటు వలన మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని అందుకని వార్డుల్లో ఫాగింగ్ చేసి బ్లీచింగ్ చల్లాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సర్పంచ్ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు నాయకులు గడల నరసింహారావు ఎంఎస్ ప్రకాష్ కొత్తపల్లి రమేష్ బాబు టౌన్ కమిటీ సభ్యులు మంద నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






