calender_icon.png 14 January, 2026 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి

13-01-2026 10:44:55 PM

- ఆర్టిఏ నెంబర్ పడాల రాహుల్

మానకొండూర్,(విజయక్రాంతి): రోడ్లపై ప్రయాణించేటప్పుడు రోడ్ భద్రతా నియమాలను, ట్రాఫిక్ నియామలను తప్పకుండా పాటించలనీ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ కోరారు. జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం  తిమ్మాపూర్ ఆర్టీవో కార్యాలయ  ఆడిటోరియంలో డ్రైవర్ లకు రోడ్ ప్రమాదంలో ప్రాథమిక చికిత్సపై, రోడ్ సైన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గోల్డెన్ హౌర్ లో ప్రాణాలను కాపాడిన వ్యక్తి నీ రాహవీర్ గా గుర్తించి 25,000 రూపాయలు ప్రోత్సాహం అందించి సన్మానం చేసి సత్కరిస్తారని తెలిపారు. అనంతరం తిమ్మాపూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు.