15 May, 2026 | 3:25 AM

భూసార పరీక్షలపై రైతులకు అవగాహన

15-05-2026 01:59 AM

మునిపల్లి మే 14 : రైతు ముంగిట్లో   శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని గురువారం మండంలోని కంకోల్ గ్రామంలో గల రైతు వేదికలో ఏవో అనితా రెడ్డి ఆధ్వర్యంలో   రైతులకు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పీజేటీఏయు ప్రధాన శాస్త్రవేత్త శేఖర్,  జహీరాబాద్ కేవీకె  శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీవరప్రసాద్,స్నేహలత, శేఖర్, ఉత్తేజ్  శైలజ  తదితరులు పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు చేసి మాట్లాడారు.

ప్రతి రైతు తప్పనిసరిగా మూడు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించుకొని భూమిలో ఉన్న పోషక స్థాయిలను తెలుసుకొని, వాటి ఆధారంగా ఎరువుల వినియోగం చేయాలని రైతులకు   సూచించారు. సేంద్రియ ఎరువులు, జీవామృతం, గోమూత్ర ఆధారిత ద్రావణాలు వంటి సేంద్రియ పద్ధతులను ప్రోత్సహిస్తూ భూసారాన్ని అభివృద్ధి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్ అసిస్టెంట్ (సాయిల్ సైన్స్)  స్వామి, మండల వ్యవసాయ అధికారి అనితారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు నిఖిత, స్నేహ, లావణ్య, రైతులు పాల్గొన్నారు.