15 May, 2026 | 3:25 AM

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

15-05-2026 01:58 AM

వెల్దుర్తి, మే 14 :  వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు నిర్వహించారు. అనంతరం మండలంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన 15 మంది లబ్ధిదారులకు ఐదు లక్షల 32 వేల చెక్కులను అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకవైపు ఇందిరమ్మ ఇండ్లు మరొకవైపు ఉచిత విద్యుత్తు, అలాగే నిరంతరం సీఎంఆర్‌ఎఫ్  చెక్కులు ప్రభుత్వం ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరుగుతుందని తద్వారా నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.