12 August, 2026 | 1:29 AM

తడి, పొడి వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ

12-08-2026 12:00 AM

జీరో వేస్ట్ వార్డుల ఏర్పాటుపై మున్సిపల్ సిబ్బందికి అవగాహన

మొయినాబాద్ ఆగస్టు 11 (విజయక్రాంతి): తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం ద్వారా పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తడి వ్యర్థాలుగా కూరగాయలు, పండ్ల అవశేషాలు, ఆహార వ్యర్థాలు, పూలు, ఆకులు, గడ్డిని గుర్తించి వాటితో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్ తయారీ విధానాలను వివరించారు. 

ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయాలి

బ్యాటరీలు, పెయింట్ డబ్బాలు, పురుగుమందుల సీసాలు, ట్యూబ్లైట్లు గృహ ప్రమాదకర వ్యర్థాలుగా గుర్తించి ప్రత్యేకంగా సేక రించి సురక్షితంగా నిర్వీర్యం చేయాలని సూచించారు. డైపర్లు, శానిటరీ న్యాప్కిన్లు, కాటన్, బ్యాండేజీలు శానిటరీ వ్యర్థాలను వేరు చేసి పారవేయాల ని వివరించారు.

జీరో వేస్ట్ వార్డులే లక్ష్యం

ఇంటివద్దే వ్యర్థాలను తడి, పొడి, ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలుగా వేరు చేయడం, ఇంటింటి సేకరణలో వర్గీకరణను పాటించడం, కంపోస్టింగ్ విధానాలను అమలు చేయడం, జీరో వేస్ట్ వార్డుల ఏర్పాటుపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, శంకర్పల్లి మున్సిపాలిటీల కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.