12 August, 2026 | 2:46 AM

ఆకట్టుకున్న ఫలహార బండి ఊరేగింపు

12-08-2026 12:00 AM

బడంగ్ పేట్,ఆగస్టు 11(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లెలగూడ మరియు బాలాపూర్ డివిజన్లలో బోనాల పండుగను పురస్కరించుకొని నిర్వహించిన పలహార బండి ఊరేగింపు కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి  టీపీసీసీ కార్యదర్శి యెలిమేటి అమరేందర్ రెడ్డి పాల్గొని భక్తులలో ఉత్సాహాన్ని నింపారు. ఆటపాటలు డప్పుచప్పులు పోతురాజుల ఆటల మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది.

కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ క్యారగారి శ్రీధర్, గజ్జెల రామచందర్, మాజీ కార్పొరేటర్లు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, వంగేటి మధుసూదన్ రెడ్డి, రాజేష్ ఠాకూర్, ఓం ప్రకాష్, ఎం. శ్రీనివాస్, రావుల లింగం, దాసరి కిరణ్, మైత్రి ఆనంద్, బల్వంత్ రెడ్డి, తాడ్కల నితీష్ కుమార్, ప్రశాంత్, సాయి కుమార్, వారికుపాల శ్రీకాంత్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, జార్జ్ శ్రీశైలం, చింతపట్ల పవన్, సూరి, మేకల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.