12 August, 2026 | 2:26 AM

సూర్యాపేట పబ్లిక్‌క్లబ్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలి

12-08-2026 01:28 AM

క్లబ్ సభ్యులు

సూర్యాపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి) : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని పలువురు క్లబ్ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ స్థానిక ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూనిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలన్నారు.అలాగే సభ్యుల్లో ఉద్యోగులు ఉన్నందున సెలవురోజున ఎన్నికలు పెట్టాలన్నారు. చనిపోయిన సభ్యుల పేర్లను జాబితా నుంచి తొలగించాలనీ సూచించారు. తదుపరి సభ్యులందరితో కూడిన జాబితాను విడుదల చేయాలన్నారు.

ప్రతీ సభ్యుడికి ఫోటోతో కూడిన ఓటర్ కార్డు అందివ్వాలన్నారు. నామినేషన్, విత్ డ్రాలకు గడువు కేటాయించాలనీ,బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేసి సీక్రెట్ విధానంలోనే ఓటింగ్ నిర్వహించాలన్నారు. ఓటింగ్ రోజునే ఫలితాలు విడుదల చేయాలన్నారు.రాజకీయాలకతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా క్లబ్ ఎన్నిక నిర్వహించాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ కౌన్సిలర్ లు గండూరి కృపాకర్, తాహెర్ పాషా, ప్రముఖ న్యాయవాదులు నాతి సవేందర్, గోండ్రాల అశోక్, నల్లకుంట్ల అయోధ్య తదితరులు ఉన్నారు.