వైభవంగా పోతరాజులు, ఫలహారబండ్ల ఊరేగింపు
- ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన ఊరేగింపు
- ప్రదర్శనలో భారీ ఆకారంలో దేవతామూర్తుల ప్రతిమలు
ముషీరాబాద్,ఆగస్టు11(విజయక్రాంతి): ముషీరాబాద్‌లో పోతరాజులు, ఫలహారబండ్ల ఊరేగింపు తెల్లవారుజాము వరకు కళాకారుల ప్రదర్శన, యువకుల నృత్యాలు, డప్పుల దరువులతో ముషీరాబాద్ ప్రాం తం అంతా దద్దరి ల్లింది. రంగురంగుల వి ద్యుత్ దీపాల వెలుగుల్లో ముషీరాబాద్ వీ ధులన్నీ దేదీప్యమానంగా వెలుగొందాయి. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ము షీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ పార్శిగుట్టలో నిర్వహించిన పో తరాజులు, ఫలహారబండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. డప్పుల దరువులు, కళాకారుల ప్రదర్శనలు, యువకుల నృత్యాలు భారీ దేవతామూర్తుల సెట్టిం గ్లు అందరిని ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే ము ఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ఎమ్మెల్యేలు టి. పద్మారావు గౌడ్, రాజాగూర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సంఘం యువజన కమిటి రాష్ట్ర అధ్యక్షుడు వీరేష్, యూత్ కాం గ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ తదితరులు హాజరై ఊరేగింపులో అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అతిథులను తలారి శ్రీకాంత్ ముదిరాజ్ సన్మానించారు. ఈ కార్యక్రమం లో ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, నాయకులు శివ ముదిరాజ్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వినోద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






