చంద్రవెల్లి గ్రామంలో పోలీసుల తనిఖీలు
అనుమతి లేని వాహనాలు సీజ్
10 లీటర్ల నాటు సారా స్వాధీనం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో(Chandanvelly village) మంగళవారం ఉదయం బెల్లంపల్లి రూరల్(Bellampalli Rural) సిఐ హానూక్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో తనిఖీలను నిర్వహించి ఎలాంటి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 14 ఆటోలు, ఒక ట్రాలీ ని పట్టుకొని సీజ్ చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన చిలుముల మల్లేశ్వరి ఇంట్లో నిర్వహించిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ హనూక్ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నేరాల వైపు అడుగులు వేయొద్దని కోరారు. మహిళల చట్టాలు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఫోక్సో నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






