05-08-2025 02:42:32 PM
తాన ఎదుటే తోపులాట జరగడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు(BJP State President) ఎన్. రాంచందర్ రావు పర్యటనలో జిల్లా బిజెపి పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యల ప్రదీప్ రావు వర్గాల మధ్య తోపులాట జోరుగగా, రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్న ర్యాలీని అడ్డుకొని ఇరువర్గాల కార్యకర్తలు తోపులాడుకున్నారు. జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసి సమావేశం అడ్డుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తల పై బిజెపి శ్రేణుల వైఖరిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.