calender_icon.png 5 August, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకం పైప్ లీకేజీ కావడంతో కార్మికులకు అస్వస్థత

05-08-2025 02:39:14 PM

కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో చోటుచేసుకున్న ఘటన...

మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం( Manoharabad Mandal) కూచారం పరిధి శీయన్స్ లాబ్ లిమిటెడ్ పరిశ్రమలో పైప్ లైన్ లీకేజీ అయి ఎనిమిది మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. పూర్తిగా కెమికల్ తో కూడిన విషవాయు ఉండడంతో ఊపిరి పీల్చుకోవడానికి కార్మికులు ఇబ్బంది పడ్డారు. లీకైన కెమికల్ గ్యాస్ పీల్చుకుని అస్వస్థకు గురైన కార్మికులను యాజమాన్యం తక్షణమే  అంబులెన్స్ లో  హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.