calender_icon.png 13 June, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగాపూర్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

12-06-2025 06:45:11 PM

వాసవి క్లబ్ వైస్ గవర్నర్ మహాజన్ జితేందర్ గుప్తా..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం లింగాపూర్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు వాసవి క్లబ్ వైస్ గవర్నర్ మహాజన్ జితేందర్ గుప్తా(Vasavi Club Vice Governor Mahajan Jitender Gupta) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధ్యక్షుడిగా కటకం రవీందర్, ఉపాధ్యక్షుడిగా కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బీగాల చంద్రశేఖర్, కోశాధికారిగా నీలి అరవిందు, సభ్యులుగా శ్రీహరి, జగన్ లతో పాటు మరో పది మంది సభ్యులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో వాసవి క్లబ్ కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎలిమెల మనోజ్ కుమార్, రీజినల్ చైర్పర్సన్ కొత్త సునీల్ లతో పాటు లింగాపూర్ ఆర్యవైశ్య సభ్యులు, పలువురు పాల్గొన్నారు.