calender_icon.png 14 October, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో నిజామాబాద్‌లో జాగృతి సమావేశం

13-10-2025 12:37:36 AM

జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజశేఖర్ 

బిచ్కుంద, అక్టోబర్ 12 (విజయక్రాంతి): నిజా మాబాద్ లో త్వరలో జాగృతి సమావేశం నిర్వహించనున్నట్లు జుక్కల్ నియోజకవర్గం జాగృతి ఇంచార్జ్ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలో సురేష్ గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలి పారు. జుక్కల్ నియోజకవర్గం లో తొందర్లోనే కార్యాచరణ ప్రణాళికలతో జాగృతిని మరింత పటిష్టవంతం చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ జాగృతి నాయకురాలు కవితక్క ఆదేశాల మేరకు మద్నూర్ మండల తెలంగాణ జాగృతి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నిజామాబాద్ లో రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.