13-10-2025 12:41:49 AM
కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ 8 వ జాతీయ కౌన్సిల్ సమావేశానికి టీ పిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ హాజరయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో 10, 11, 12 తేదీలలో మూడు రోజులపాటు జరిగిన ఎనిమిదవ జాతీయ కౌన్సిల్ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న సంస్కరణలపై కౌన్సిల్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
ఈ కౌన్సిల్కు తెలంగాణ రాష్ట్రం నుండి టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సకినాల అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి నన్నయమైన తిరుపతి లో హాజరవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సకినాలు అనిల్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నుకున్నారు.
జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సకినాల అనిల్ కుమార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు టీ శ్రీనివాస్ నాలిని నరేందర్ సోలేటి నారాయణ అంజయ్య రాజశేఖర్ కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.