4 April, 2026 | 2:16 AM

ప్రభుత్వ పథకాలపై అవగాహన

04-04-2026 12:33 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 3: జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అడివెంల గ్రామంలో శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆట, పాట, మాటల ద్వారా ప్రభుత్వ పథకాల విశిష్టతను గ్రామస్తులకు వివరించారు.

ప్రజలందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కలకోట్ల శైలేందర్, ఉపసర్పంచ్ వజ్జె చిన్న రవి, తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ వేముల శ్రవణ్, కళాకారులు వెన్నెల నాగరాజు, ఈర్ల సైదులు, మేడిపల్లి వేణు, చల్లా లక్ష్మి, ప్రియాంక, ప్రియదర్శిని, శిరీష, స్రవంతి, ఇంద్రజ, గ్రామస్తులు  పాల్గొన్నారు.