09-11-2025 06:18:26 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవా దినోత్సనం సందర్భంగా పెద్దపల్లి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అదేశాల మేరకు ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల హాస్టల్ లో న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై రిటైనర్ లాయర్ ఆవుల శివకృష్ణ, పారా లీగల్ వాలంటీర్ పూర్ణ చందర్ లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అససియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, పిఎల్వీ శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.