calender_icon.png 17 January, 2026 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగం కాదు జీవితం ముఖ్యం ఇల్లు చేరడమే లక్ష్యం: ఎస్ఐ రవి గౌడ్

17-01-2026 10:01:05 PM

కల్హేర్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం బాచేపల్లి జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల గురించి వ్యాస రచన ఫోటీలు నిర్వహించారు. ఎస్ఐ రవి గౌడ్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా పోలీస్, రవాణా, రోడ్డు భద్రత పై వివిధ రకాల అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ విదిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణ రక్షణకు సహకరించి, క్షేమంగా వాహనాలు నడపుతూ సురక్షిత ప్రయాణం చేయాలని అన్నారు. విద్యార్థులు, తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా విద్యార్థులతో ఎస్ఐ రవి గౌడ్ ప్రతిజ్ఞ చేయించారు.