calender_icon.png 17 January, 2026 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాల మున్సిపల్ ఎన్నికలలో మాలలకు టికెట్లు కేటాయించాలి

17-01-2026 10:04:47 PM

* జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ 

చేర్యాల: జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ కేటాయింపులలో భాగంగా చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డు లలో రెండు వార్డులను ఎస్సీలకు కేటాయించినారని ఇందులో మాల సామాజిక వర్గానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

గతంలో చేర్యాల గ్రామపంచాయతీ ఉన్నప్పుడు గాని,గత మున్సిపాలిటీ పాలకవర్గంలో గాని మాల సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రధాన పార్టీలు అణచివేతకు గురి చేయడం జరిగిందని కానీ ఈ సారి కూడా అదే వైఖరితో కాకుండా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ప్రధాన రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీరాం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.