17-01-2026 09:57:38 PM
బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రతి రైతుకు గుర్తింపు కార్డు తప్పనిసరి చేసుకోవాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి భూపాల్ సంతోష్ రైతులకు సూచించారు. శనివారం మండలం కోనాపూర్ గ్రామంలో రైతుకు గుర్తింపు కార్డుల ప్రక్రియ కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రతి రైతు పట్టాదార్ పాస్ బుక్ కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావాలంటే రైతు గుర్తింపు కార్డు తప్పని సరి చేసుకోవాలని తెలపడం జరిగింది రైతు వేదికలలో లేదా మీ సేవ కేంద్రాలలో చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెప్పాల రాజేష్, ఉప సర్పంచ్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొనడం జరిగింది.