30 May, 2026 | 6:57 PM

పంట అవశేషాల దహనం మానాలి.. భూసారాన్ని కాపాడాలి

30-05-2026 05:55 PM

బధ్యతండలో ప్రజలకు అవగాహన కల్పించిన సర్పంచ్ సైదానాయక్

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని బధ్యతండ గ్రామ పంచాయతీలో పంట అవశేషాలు కాల్చవద్దు, భూసారాన్ని తగ్గించవద్దు అనే అంశంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైదానాయక్ మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని పోషకాలు, సేంద్రియ పదార్థాలు నశించి భూసారం తగ్గిపోతుందని తెలిపారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భవిష్యత్తులో పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. భూమి సారవంతతను కాపాడేందుకు రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవి, ఏఈవో వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.