బాల్యవివాహాలను అరికట్టాలి
ములకలపల్లి, (విజయక్రాంతి): బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దమ్మపేట ఐసిడిఎస్ సిడిపిఓ హేమ సత్య కోరారు.ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మండల స్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎల్లోప్మెంట్ కేసెస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలకు, వారి తల్లితండ్రులకు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు.
బాల్య వివాహలు, ముందస్తు గర్భాదారణ వలన బాలికలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతాయని, అందువలన జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని, చదువుమీద శ్రద్ధ వహించాలని సూచించారు.తెలియజేయడం జరిగినది. సే నో టు డ్రగ్స్ లో భాగంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు కు బానిస అయిన వారికి డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయని తెలియజేశారు.






