calender_icon.png 12 August, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా డిగ్రీ కళాశాలలో సఖి కేంద్రం అవగాహన కార్యక్రమం..

30-11-2024 09:56:36 PM

రామాయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్ నందు సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సీఐ.వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ.. నవంబర్ 25 హింస వ్యతిరేక దినోత్సవం నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు హింస పక్షోత్సవాలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ రోజుల్లోనే హింసను వ్యతిరేకించడం కాకుండా ప్రతిరోజు తమపై జరుగుతున్న హింసను ఆపే విధంగా ఉండాలని తెలపడం జరిగిందన్నారు. సఖి కేంద్రం స్త్రీలు బాలికలపై జరుగుతున్నటువంటి శారీరక మానసిక లైంగిక ఆర్థిక హింసల నుండి బయటపడటానికి వ్యక్తిగతంగా తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ గురించి వివరించడం జరిగిందన్నారు.

జెండర్స్ సమానత్వం గురించి సెల్ ఫోన్ వాడకం వలన ఉపయోగాలు, వచ్చే సమస్యలు తెలపడం, చిన్న చిన్న వస్తువులకి గిఫ్ట్ లకు ప్రలోభ పడకుండా స్ట్రాంగ్ గా ఉండాలని ఆడ మగ తేడా లేకుండా అక్రమ రవాణా చేస్తూ వివిధ వృత్తుల్లో దింపడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అత్యవసర సమయంలో 100, 181, 1098, 1930, 112, టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, సిఐ. వెంకట రాజాగౌడ్, ఎస్సై బాలరాజ్, సఖి కేంద్రం కేస్ వర్కర్ కళావతి, పారామెడికల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.