29 April, 2026 | 3:12 AM

భిక్కనూర్ పీహెచ్సీలో అమ్మఒడి, హెచ్పీవీ వ్యాక్సిన్, వడదెబ్బపై అవగాహన

29-04-2026 01:57 AM

భిక్కనూర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డాక్టర్ యెమిమా ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలను పరీక్షించి రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు అందజేశారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం, తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అలాగే 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మండలంలో 125 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాచాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించి, ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు లత, విజయ పాల్గొన్నారు.