29 April, 2026 | 3:22 AM

ఎమ్మెల్సీ కోదండరామ్‌కు సత్కారం

29-04-2026 01:58 AM

శుభాకాంక్షలు తెలిపిన బస్తీదవాఖాన ఉద్యోగులు

హైదరాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంగళవారం బస్తీదవాఖానా ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకలోని కోదండరాం స్వగృహంలో ఆయన్ని బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ కలసి కోదండరాం శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపర్చి మిఠాయి లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ బస్తీదవాఖాన కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళపాటి సుమన్, ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్,అసోసియేషన్ కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య, అనిత, శాంత మ్మ , రౌతు నర్సింహా, భావిక, సైమన్ రాజ్, మధుబాబు, సుశీల, స్వప్న,లత తదితరులు పాల్గొన్నారు.