calender_icon.png 29 January, 2026 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండాలి

29-01-2026 01:09:11 PM

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

నామినేషన్  కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు

జిల్లాలో ఎన్నికల నియమావళి  పకడ్బందీగా అమలు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు భారీ గేట్లు పోలీసు బందోబస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులకు సిబ్బందికి పాలు కీలక సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

అభ్యర్థులు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలని కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనల విరుద్ధంగా ఎక్కువ మంది రావడం, నినాదాలు చేయడం ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడం ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

జిల్లా కార్యాలయంలో ప్రత్యేక బృందం ప్రతి పోస్ట్ నిష్ఠంగా గమనిస్తుందని తెలిపారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాల సిద్ధంగా ఉందని ఎస్పి అన్నారు. శాంతి భద్రతల విగా దానికి ప్రయత్నించే వారి నీ ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు అభ్యర్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.