29-01-2026 01:07:45 PM
బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి
దేవరకద్ర : సమగ్ర అభివృద్ధి బిజెపి లక్ష్యంగా అడుగులు వేస్తుందని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ డోఖ్పూర్ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. దేవకద్ర నియోజకవర్గం కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో అశోక్ సాగర్ బిజెపి మండల ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో చౌదర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నంది కురుమయ్య, తో పాటు పలువురు నాయకులు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, దొడ్ల శ్రీను, చౌదర్పల్లి గ్రామ బిజెపి అధ్యక్షులు శంకర్, ఉపాధ్యక్షుడు మల్లేష్, శ్రీశైలం, వెంకటేష్, మహేష్, ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.