29-01-2026 01:10:22 PM
ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటాలి
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట : క్రీడల్లో గెలుపు ఓటమిలో సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలం దమగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యేజి. మధుసూదన్ రెడ్డి తండ్రి స్వర్గీయ గవినోళ్ళ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన దమగ్నాపూర్ ప్రీమియర్ లీగ్ (DPL) క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ల్, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.