బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన సదస్సు
న్యూరో ఫిజీషియన్ హైందవ కుమార్ రెడ్డి
వనపర్తి ఆగస్టు 16 ( విజయక్రాంతి ) : బ్రెయిన్ స్ట్ప్రో ప్రజల్లో అవగాహన పెంచేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆది వారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్ట ర్ బి. హైందవ కుమార్ రెడ్డి పాల్గొని బ్రెయి న్ స్ట్రోక్కు సంబంధించిన కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగా హన కల్పించారు.
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం లేదా రక్తనాళం పగిలి మెదడులో రక్తస్రావం జరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని తెలిపారు. స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, లక్షణాలు కనిపించిన వెంటనే మెరుగైన వైద్య సదుపాయం ఉన్న ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశా ల అధ్యాపకులు, విద్యార్థులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.






